ప్రేమ జంటను లంచం అడిగి ఏసీబీకి చిక్కిన ఎస్సై

by Ajay Maddhiboyina |

ఓ ఎస్సై, కానిస్టేబుల్ ప్రేమ‌జంట‌ను బెదిరించి పెళ్లి చేసుకోవ‌డం షాకింగ్ గా మారింది. ఈ ఘ‌ట‌న ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ జంటను లంచం అడిగి ఏసీబీకి చిక్కిన ఎస్సై
X

దిశ, వెబ్ డెస్క్: లంచం..లంచం..లంచం.. పిలిస్తే లంచం పలికితే లంచం.. అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల తీరు చూస్తే ఆ డైలాగ్ నిజమోనేమో అనిపిస్తుంది. అయితే చాలా కేసుల్లో పోలీసులు లంచాలు తీసుకుని ప‌ట్టుబ‌డిన సంద‌ర్బాలు ఉన్నాయి. కానీ తాజాగా ఓ ఎస్సై, కానిస్టేబుల్ ప్రేమ‌జంట‌ను బెదిరించి పెళ్లి చేసుకోవ‌డం షాకింగ్ గా మారింది. ఈ ఘ‌ట‌న ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట త‌మ త‌ల్లిదండ్రుల నుండి ర‌క్ష‌ణ కోరుతూ త‌మ పెళ్లి జ‌రిపించాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా ఎస్సై పి. నాగరాజు, కానిస్టేబుల్ బాల‌కృష్ణ వారిని బెదిరించి రూ.70వేల లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

ప్రేమ జంట అంటే దాదాపు ఇంటి నుండి పారిపోయి వ‌స్తారు. వాళ్ల చేతిలోనే చిల్లిగ‌వ్వ ఉంటుందో లేదో. అలాంటి వాళ్ల‌ను లంచం అడ‌గ‌టంతో ఏం చేయాలో తెలియ‌క చివ‌రికి ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. ఆ మ‌రుస‌టి రోజు ప్రేమ జంట పోలీసుల‌కు లంచం ఇస్తుండ‌గా అధికారులు ఎంట్రీ ఇచ్చి ఎస్సై నాగ‌రాజు, కానిస్టేబుల్ బాల‌కృష్ణ‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. పోలీసుల అవినీతి వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో వారి అక్ర‌మ ఆస్తుల‌పై కూడా విచార‌ణ జ‌రిపితే మ‌రింత అక్ర‌మ సంపాద‌న వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉందని చాలా మంది కోరుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ఉండేలా ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story