- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో సంచలనం.. రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపి ఎస్కేప్..
పంజాబ్ సనౌర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పఠాన్‌మజ్రాను రేప్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే హర్యానా కర్నాల్‌లో అతను పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ సనౌర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పఠాన్‌మజ్రాను రేప్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే హర్యానా కర్నాల్‌లో అతను పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. అతని సహచరులతో కలిసి స్కార్పియో ఎస్‌యూవీలో పరారైనట్లు సమాచారం. ఈ క్రమంలో కాల్పుల్లో ఓ పోలీసు గాయపడగా.. మరో పోలీసు అధికారిని వాహనంతో ఢీకొని ఎస్కేప్ అయ్యాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు హర్యానా, పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు.
ఇక అతనిపై ఆగస్టు 26న ఫిర్యాదు చేసింది ఓ మహిళ. వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకున్నాడని, లైంగికంగా వేధించాడని ఆరోపించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేయగా.. ఎస్కేప్ అయ్యాడు. కాగా ఈ ఎమ్మెల్యేకు ఇది ఫస్ట్ కాంట్రవర్సీ కాదని.. 2022లో అతని రెండో భార్య కూడా ఇలాంటి కేసు పెట్టిందని తెలుస్తోంది. ఫస్ట్ మ్యారేజ్ గురించి చెప్పకుండా తనను పెళ్లి చేసుకున్నాడని.. బహుభార్యత్వం కారణంగా చర్యలు తీసుకోవాలని ఆరోపించింది. ఇక పఠాన్‌మజ్రా అరెస్ట్‌తో ఫాలోవర్స్ నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.






