- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రద్ధా వాల్కర్ కేసులో మరో భయంకర నిజం.. తెలిస్తే షాకవడం ఖాయం..!
3 నెలల తర్వాత శ్రద్ధా వాల్కర్ తలను ఆఫ్తాబ్ పూనావాలా బటయ పడేసినట్లు పోలీసులు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ప్రియుడు చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాల్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్ధా వాల్కర్ ను ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా 35 ముక్కలుగా కోసి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ కేసుకు సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ భయంకర నిజం బయటకు వచ్చింది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి 6600 పేజీల చార్జీషీట్ లోని భయంకర నిజాలను పోలీసులు బయటపెట్టారు. చార్జీషీట్ లో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియురాలు శ్రద్ధాను హత్య చేసిన 3 నెలల తర్వాత ఆమె తలను బయట పడేశానని ఆఫ్తాబ్ చార్జీషీట్ లో పేర్కొన్నాడు. ముందుగా ఆమె బాడీ పార్ట్స్ ను 35 ముక్కలుగా చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశానని తెలిపాడు. అయితే ఆమె తలను మాత్రం మిక్సీ సాయంతో పౌడర్ గా చేసి మూడు నెలల తర్వాత బయట పడేసినట్లు విచారణలో పేర్కొన్నాడు. పాలీ గ్రాఫ్, నార్కో పరీక్షల్లో శ్రద్ధాను చంపినట్లు నిందితుడు ఆఫ్తాబ్ ఒప్పుకున్నాడు. అయితే విచారణ సమయంలో అతడిలో ఎలాంటి అపరాధం భావం కనిపించకపోవడం గమనార్హం. ఆఫ్తాబ్ పడేసిన శ్రద్ధా వాల్కర్ కు చెందిన 35 బాడీ పార్ట్స్ లో ఇప్పటికే 20 వరకు లభించినట్లు పోలీసులు తెలిపారు.






