టెక్స్‌టైల్ పార్క్‌లో పనిచేస్తున్న యువతి కిడ్నాప్

by Chintha Aamani |

టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న యువతిని కిడ్నాప్ చేసిన ఘటన గీసుగొండ మండలం ధర్మారంలో చోటు చేసుకుంది.

టెక్స్‌టైల్ పార్క్‌లో పనిచేస్తున్న యువతి కిడ్నాప్
X

దిశ,గీసుగొండ: టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న యువతిని కిడ్నాప్ చేసిన ఘటన గీసుగొండ మండలం ధర్మారంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ పరది టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న యువతిని గుర్తు తెలియని దుండగులు ధర్మారం గ్రామం వద్ద కిడ్నాప్ చేశారు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రింకిమళ్లీ (21) అనే యువతి గేరి పేంద్ర,ప్రియాంక, ప్రియాలతో కలిసి ధర్మారం గ్రామంలో ఉంటూ టెక్స్‌టైల్ పార్కులో పనిచేస్తుంది.

రోజు లాగే గురువారం టెక్స్‌టైల్ పార్క్ లో పనిచేసిన అనంతరం కంపెనీ వాహనంలో సాయంత్రం 6 గంటలకు సమయంలో ధర్మారం బస్ స్టాప్ వద్ద దిగి పానీ పూరి తిని నలుగురు కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా వరంగల్ వైపు నుండి నర్సంపేట వైపు వస్తున్న ఒక కారు ఆపి రింకి మళ్లీ ని బలవంతంగా వారి కారులో ఎక్కించుకుని వెళ్లారని ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు కనిపించారని రింకిమల్లి స్నేహితురాలు గేరిపేంద్ర తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ తెలిపారు. కిడ్నాప్ చేసిన వారు రింకి మళ్లీ భర్త అతని కుటుంబ సభ్యులే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story