- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాబ్ బుక్ చేసిన యువతికి అసభ్య మెసేజ్.. గంటల వ్యవధిలోనే డ్రైవర్ అరెస్ట్
by Ramesh Naini |
రాత్రి వేళ ఇంటికి వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్న ఓ యువతికి క్యాబ్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్ పంపిన ఘటన కొండాపూర్‌లో చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాత్రి వేళ ఇంటికి వెళ్లేందుకు ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్న ఓ యువతికి క్యాబ్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్ పంపిన ఘటన కొండాపూర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాత్రి సమయంలో ఓ యువతి క్యాబ్ బుక్ చేసుకోగా విశాల్ అనే డ్రైవర్ ఆ రైడ్ యాక్సెప్ట్ చేశాడు. ఆమెను పికప్ చేసుకునేందుకు వస్తున్న క్రమంలో.. యాప్ చాట్ ద్వారా యువతికి ఓ అసభ్యకరమైన మెసేజ్ పంపాడు. అది చూసిన బాధితురాలు మొదట తీవ్ర భయాందోళనలకు గురైంది. వెంటనే తేరుకుని ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీనిపై తక్షణమే స్పందించిన సైబరాబాద్ షీ టీమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు చేపట్టి, గంటల వ్యవధిలోనే నిందితుడైన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
Next Story






