- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. తల్లి మందలించడంతో విద్యార్థిని సూసైడ్
by Satheesh |
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చదువుపై మరింత దృష్టి పెట్టాలని తల్లి మందలించటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇందిరానగర్ నివాసి అనూష (19) నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అయితే, మరింతగా చదవాలని, లేకపోతే ర్యాంక్ రాదని తల్లి మందలించింది. దాంతో బుధవారం అనూష తన ఫోన్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అనూష మృతదేహం రామంతాపూర్ చిన్న చెరువులో గురువారం నీటి పైకి తేలింది. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు.
Next Story






