- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్సర్ బైక్ నడిపిన యువతి...అంతలోనే కాలువలో పడి జంట గల్లంతు !
యువతితో పాటు బైక్‌పై కూర్చున్న యువకుడు కాలువలో గల్లంతు అయ్యారు.జగిత్యాల జిల్లా పెద్దాపూర్ కాలువలో ఘటన చోటు చేసుకుంది.

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దాపూర్ కాకతీయ కాలువలో పడి ఇద్దరు గల్లంతయిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై రామచంద్రం తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన అంకుష్(20) అనే యువకుడు మెట్ పల్లి డీడీ నగర్ చెందిన తన బావ దగ్గర ఉంటూ కూలి పని చేసే వాడు. అయితే వెల్లుల్ల గ్రామానికి చెందిన లావణ్య (19) అనే అమ్మాయితో పని చేసే చోటనే అంకుష్ కు పరిచయం ఏర్పడింది. ఇక గురువారం సాయంత్రం ఈ జంట, పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ నుంచి కాకతీయ కాలువ వైపు వస్తోంది.
ఈ సందర్భంగా లావణ్యకు బైక్ డ్రైవింగ్ నేర్పించే ప్రయత్నం చేశాడు అంకుష్. ఈ క్రమంలోనే లావణ్యతో పాటు బైక్‌పై కూర్చున్న అంకుష్ కూడా కాలువలో పడి గల్లంతు అయ్యాడు. ఇక ఈ ఘటనపై సర్పంచ్ జీవన్ రెడ్డి సమాచారం ఇవ్వగా ఎస్సై రామచంద్రం తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను కాలువలోకి దించి పల్సర్ బైక్‌ను వెలికి తీశారు. ఇక యువకుడి ఆచూకీ దొరకగా, యువతి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. క్లిక్






