భార్య లవర్ గొంతు కోసి రక్తాన్ని తాగిన వ్యక్తి.. కెమెరాతో షూట్ చేసిన ఫ్రెండ్

by Dishafeatures2 |
భార్య లవర్ గొంతు కోసి రక్తాన్ని తాగిన వ్యక్తి.. కెమెరాతో షూట్ చేసిన ఫ్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి గొంతు కోసి రక్తాన్ని తాగాడో యువకుడు. ఈ దృశ్యాన్ని మొత్తం అతడి మొబైల్ ఫోన్ తో షూట్ చేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన కర్ణాటకలోని చిక్కాబల్లాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చిక్కాబల్లాపూర్ జిల్లా చింతామణి తాలూకాకు చెందిన విజయ్ అనే వ్యక్తి తన భార్య మారేశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఈ క్రమంలోనే మారేశ్ ను హత్య చేయాలని పథకం రూపొందించాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న తన ఫ్రెండ్ జాన్ తో కలిసి విజయ్ తన భార్య ప్రియుడైన మారేశ్ ను కలిశాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించడానికి నగర శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే మద్యం సేవించాక విజయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా అంటూ మారేశ్ పై కత్తితో దాడి చేశాడు. మారేశ్ ను కిందపడేసి అతడి గొంతును కోశాడు. రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగాడు. ఇక ఈ దృశ్యాన్ని మొత్తం తన ఫ్రెండ్ జాన్ మొబైల్ ఫోన్ లో బంధించాడు. కాగా ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మారేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక నిందితులు విజయ్, జాన్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.



Next Story