పెళ్లై ఏడాదే.. చేపల వేటకు వెళ్లిన యువకుడు మిస్సింగ్

by Bhoopathi Nagaiah |

చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటన జడ్చర్లలో జరిగింది.

పెళ్లై ఏడాదే.. చేపల వేటకు వెళ్లిన యువకుడు మిస్సింగ్
X

దిశ, జడ్చర్ల : చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటన జడ్చర్లలో జరిగింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వంద పడకల ఆసుపత్రి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చేపల వేటకు వెళ్లి యువకుడు భాను (24) గల్లంతయ్యాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంట ప్రాంతానికి చెందిన భాను తన స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం పట్టణంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చేపల వేటకు వెళ్ళాడు. ఇదే క్రమంలో కాలు జారి వరద నీటిలో గల్లంతు అవుతుండగా తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జడ్చర్ల ఫైర్ సిబ్బంది గల్లంతైన భాను కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన భానుకు గత సంవత్సరమే వివాహం అయిందని బంధువుల రోదనలు ఘటనా స్థలం వద్ద మిన్నంటాయి.

Next Story