నగరంలో మరో దారుణం.. మాయ మాటలు చెప్పి మైనర్ బాలికపై లైంగిక దాడి

by Disha Web Desk 19 |
నగరంలో మరో దారుణం.. మాయ మాటలు చెప్పి మైనర్ బాలికపై లైంగిక దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో రోజురోజుకు మహిళలు, మైనర్ బాలికలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఓ మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన మరువక ముందే.. తాజాగా నగరంలో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. చార్మినార్ ప్రాంతం నుండి ఓ యువకుడు మైనర్ బాలికకు (15) మాయ మాటలు చెప్పి నార్సింగ్ పరిధిలోని వట్టిపల్లికి తీసుకెళ్లాడు. అనంతరం తనలోని అసలు బుద్ధి చూపించాడు. నగరశివారులోని వట్టిపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి : ప్రేమను నిరాకరించిందని మైనర్‌పై యాసిడ్ దాడి..

Next Story