చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద మూసీలోకి దూకిన యువకుడు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ బ్రిడ్జ్ వద్ద సోమవారం సాయంత్రం ఒక యువకుడు మూసీ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చాదర్ ఘాట్ బ్రిడ్జి వద్ద మూసీలోకి దూకిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ బ్రిడ్జ్ వద్ద సోమవారం సాయంత్రం ఒక యువకుడు మూసీ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. సదరు యువకుడు తన బైక్‌ను వంతెనపై ఫుట్‌పాత్‌పై పార్క్ చేసి, అకస్మాత్తుగా మూసీలోకి దూకినట్లు తెలిపారు. నదిలో వరద ఉధృతంగా ఉండటంతో, దూకిన కొద్ది క్షణాల్లోనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. చాదర్ ఘాట్ పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా బ్రిడ్జిపై పార్క్ చేసిన TS11FA 4052 బైక్ నంబర్ ఆధారంగా యువకుడి పేరు కిరణ్ గౌడ్‌గా ప్రాథమికంగా నిర్ధారించారు.

Next Story