- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి..
by Batti.Sumithra |
కోరుట్ల పట్టణంలోని రాంనగర్ కాలనిలో కొత్తపేట గణేష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

X
దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్ల పట్టణంలోని రాంనగర్ కాలనిలో కొత్తపేట గణేష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గణేష్ గత కొంత కాలం క్రితం గల్ఫ్ దేశం నుండి వచ్చి స్థానికంగానే ఉండి పనులు చేసుకుంటున్నాడు. గణేష్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అక్కడున్న వారు ఇంటి తలుపులు తీసి చూసేసరికి గణేష్ మృతి చెంది ఉన్నాడు.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. దుర్వాసన రావడంతో గణేష్ నాలుగు రోజులు కిందటే మరణించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు భావిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Next Story






