- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద కాలువలో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి
తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బనక చందు మల్లాపూర్ శివారులోని డీ- 4 కెనాల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బనక చందు మల్లాపూర్ శివారులోని డీ- 4 కెనాల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బనక చందు కొన్నేళ్ల క్రితం దుబాయ్ కు వెళ్లి 20 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ద్విచక్ర వాహనం పై వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. తన కుటుంబికులు చందు మొబైల్ కు కాల్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మధ్యాహ్నం మల్లాపూర్ శివారులోని డి -4 కాలువ వద్ద స్థానికులు చందు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబికులు అతడినీ చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని శరీరం పై గాయాలు ఉండడం, కెనాల్ లో మనిషి మునిగేంత నీరు లేకపోవడంతో పలు అనుమానాలకు తావు ఇస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






