- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ద్విచక్ర వాహనంపై తల్లి-కుమారుడు 44వ జాతీయ రహదారి రోడ్డు పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన చోటు చేసుకున్నది.

దిశ, ఉండవెల్లి : ద్విచక్ర వాహనంపై తల్లి-కుమారుడు 44వ జాతీయ రహదారి రోడ్డు పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన చోటు చేసుకున్నది. 108వాహన సిబ్బంది రాధామోహన్, నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన యాకుబ్ బాషా సత్తాజ్ బేగం దంపతుల కుమారుడు మజ్హర్ తన తల్లితో కలిసి స్వగ్రామం ఉండవెల్లి నుంచి కర్నూలు కు ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. అలంపూర్ చౌరస్తా ఉత్తర ఫుడ్స్ కంపెనీ దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నది. దీంతో మజ్హర్‌కు తీవ్ర రక్త గాయాలు కావడంతో 108వాహనం లో కర్నూలు తరలించి చికిత్స పొందుతూ మృతి చెందిన్నట్లు 108సిబ్బంది పేర్కొన్నారు. మజ్హర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్న చదువుతున్నట్లు సమాచారం. రంజాన్ పండగ పూట కన్న కొడుకు కళ్ల ఎదుటే మృతి చెందడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నది.






