రోడ్డు ప్రమాదంలో యువ‌కుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

రోడ్డు ప్రమాదంలో యువ‌కుడు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం శివారు 65వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువ‌కుడు మృతి
X

దిశ, సదాశివపేట : రోడ్డు ప్రమాదంలో యువ‌కుడు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారు జామున సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం శివారు 65వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బోరబండకు చెందిన సుశాంత్ తన స్నేహితులతో ఓ ఫంక్షన్ కి తూఫాన్ వాహనంలో హైదరాబాద్ నుంచి బీదర్ కు వెళ్తున్న క్రమంలో సదాశివపేట శివారు జాతీయ రహదారిపై తుఫాన్ అదుపుతప్పి పల్టీ కొట్టగా.. పక్కనున్న గుంతలో పడిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న సుశాంత్ (21) కి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించామన్నారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Next Story