- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..
by Taduka Kalyani |
వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.

X
దిశ, గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోడేరు మండలం జనంపల్లి గ్రామానికి చెందిన బాసారం శేఖర్ గ్రామం నుంచి గోపాలపేట వైపు వెళ్తుండగా అదే సమయంలో ట్రాక్టర్ అటువైపు నుంచి వచ్చి బైకును ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో బైకు నడుపుతున్న శేఖర్ కింద పడిపోయాడు. శేఖర్ తలపై నుంచి ట్రాక్టర్ ట్రాలీ వెళ్లడంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






