బైక్ ప్రమాదంలో యువకుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

బైకు ప్ర‌మాదంలో యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణం కాక‌ర్ల‌ప‌ల్లి రోడ్డులో చోటు చేసుకుంది.

బైక్ ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, సత్తుపల్లి : బైకు ప్ర‌మాదంలో యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణం కాక‌ర్ల‌ప‌ల్లి రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ జమీల్, వెల్డింగ్ వర్క్ చేస్తూ జీవనం కొన‌సాగిస్తుంటాడు. షెక్ జోసఫ్ ఇస్తరాకుల కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు ఇరువురు కాకర్లపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి కి వస్తుండగా.. సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్డు నందు ప్రమాదవశాత్తు బైకు సైడ్ కాలవలో పడటంతో షేక్ జమీల్ (28) అక్కడికక్కడే మృతి చెందగా.. షేక్ జోసెఫ్ కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. ఈ సంఘటన పై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story