- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిమిసంహారక మందు తాగి యువకుడు మృతి
తనపై పెట్టిన కేసును రాజీ చేసుకోకపోతే మీరు చావనైనా చావాలి లేదంటే నేను ఎప్పటికైనా చంపక తప్పదు అంటూ ప్రజాప్రతినిధి బెదిరించడంతో యువకుడు భయంతో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐకే రాజు తెలిపారు.

దిశ, రామడుగు : తనపై పెట్టిన కేసును రాజీ చేసుకోకపోతే మీరు చావనైనా చావాలి లేదంటే నేను ఎప్పటికైనా చంపక తప్పదు అంటూ ప్రజాప్రతినిధి బెదిరించడంతో యువకుడు భయంతో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అందించిన సమాచారం మేరకు రామడుగు మండలం దేశరాజు పల్లి గ్రామానికి చెందిన కాల్వ రమేష్ అనే యువకుడు గురువారం క్రిమిసంహారక మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి అయినా మంచి మహేందర్ రెడ్డి గత నెల క్రితం కాలువ రమేష్ తో పాటు తన కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి అ కారణంగా దాడి చేసి ఎప్పటికైనా మిమ్ములను చంపక తప్పదు అంటూ బెదిరింపులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. కాగా అప్పుడే కొంచెం మహేందర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయడంతో స్టేషన్ బెయిల్ పై మహేందర్ రెడ్డి ఉన్నట్లు పేర్కొన్నారు. దీనితో కాల్వ రమేష్ అనే యువకుడు ఎప్పటికైనా నన్ను చంపుతాడు అని భయంతో గురువారం గ్రామ శివారు ప్రాంతంలో క్రిమిసంహారకమందు సేవించి తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఇట్టి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రమేష్ ను అపస్మారక స్థితిలో గమనించి కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయంపై మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.






