రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2023-05-17 12:12:53  IST  )

మద్యానికి బానిసై, అనారోగ్యంతో జీవితంపై విరక్తి కలిగి రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది.

రైలు కిందపడి యువకుడి బలవన్మరణం
X

దిశ, జమ్మికుంట : మద్యానికి బానిసై, అనారోగ్యంతో జీవితంపై విరక్తి కలిగి రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కథనం మేరకు.. శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి చెందిన మారముల్ల అజయ్ కుమార్ (19) అనే యువకుడు బుధవారం జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పలు ఆస్పత్రుల్లో తిరిగినా రోగం నయం కాకపోవడంతో మనస్తాపానికి గురై అజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి రాజేందర్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.

Next Story