మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

by Ratna Kumari |

దిశ, వేమనపల్లి : మద్యానికి బానిసై గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కేతనపల్లి గ్రామానికి

మద్యానికి బానిసై  యువకుడు ఆత్మహత్య
X

దిశ, వేమనపల్లి : మద్యానికి బానిసై గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కేతనపల్లి గ్రామానికి చెందిన గురుండ్ల కార్తీక్ 20 అనే యువకుడు మద్యానికి బానిస అవ్వడంతో అతని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై శుక్రవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు వెంటనే చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించినట్లు ఆయన తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

Next Story