ప్రేమ విఫలమవడంతో తనువు చాలించిన యువకుడు

by Chintha Aamani |

ప్రేమ విఫలమైందని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ప్రేమ విఫలమవడంతో తనువు చాలించిన యువకుడు
X

దిశ,ఉప్పల్: ప్రేమ విఫలమైందని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రామంతపూర్ గోకలే నగర్ లో ఏనోష్ చక్రపాణి(27) నివాసం ఉంటున్నాడు.పీర్జాదిగూడ కు చెందిన అమ్మాయితో 2018 నుండి ఫ్రెండ్ గా ఉంటూ పరిచయాన్ని చక్రపాణి కొనసాగించాడు. అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. ఇద్దరి విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో మేడిపల్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొంత కాలం తరువాత ఆ అమ్మాయి ఇంటర్ చదువుతున్న కాలంలో 2021లో రిలేషన్ కొనసాగించడంతో, చక్రపాణి ఆ అమ్మాయి ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్ళీ మేడిపల్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 2025 సంవత్సరంలో ఇద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది.

ఆ అమ్మాయిని చక్రపాణి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయికి కూడా చక్రవర్తిపై ఇష్టం తగ్గిపోవడంతో పెళ్ళిపై ఇష్టం లేదని, వద్దు అనడం జరిగిందని,వేరే వారితో రిలేషన్ లో ఉన్నట్లు చక్రవర్తి తెలిపినట్లు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు తెలిపారు. హరిప్రియ మీద ఇష్టం వదులుకోక చక్రపాణి రెండు నెలలుగా తిరిగాడు. రామంతపూర్ హోటల్ లో హరిప్రియ మైనర్ గా ఉన్నపుడు చక్రపాణి బలాత్కారం చేసినట్లు మే 2025 ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం ప్రకారం చక్రపాణిపై కేసు కావడం రెండు నెలలు జైలు కి వెళ్లి 15 రోజుల క్రితం వచ్చాడు.

హరిప్రియ మీద ఉన్న ప్రేమతో హరిప్రియను చక్రపాణి పెళ్లి కోసం అడగాడని, హరిప్రియ నీవు ఇష్టం లేదని చెప్పడంతో పూర్తిగా ప్రేమ పేరుతో మోసపోయానని, రేప్ కేసులో జైలుకు వెళ్లి రావడంతో మనస్తాపంతో లెటర్ రాసి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.చక్రపాణి సూసైడ్ పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story