పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

పురుగుల మందు తాగి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న సుల్తానాబాద్ మండ‌లం రామునిప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
X

దిశ, సుల్తానాబాద్ : పురుగుల మందు తాగి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న సుల్తానాబాద్ మండ‌లం రామునిప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్ర‌కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల పరిధిలోని రామునిప‌ల్లి గ్రామానికి చెందిన ముడ‌త‌న‌ప‌ల్లి సుధాక‌ర్ కుమారుడు చ‌ర‌ణ్(25) పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చ‌ర‌ణ్ హైద‌రాబాద్ లో ఎంసీఏ పూర్తి చేసి ఇంటివ‌ద్ద‌నే ఉంటున్నాడు. త‌న తోటి స్నేహితుల‌కు ఉద్యోగాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అత‌నికి మాత్రం ఉద్యోగం రాలేద‌నే బాధ‌తో మ‌న‌స్థాపం చెందిన ఫిబ్ర‌వ‌రి 05న పొలం వ‌ద్ద‌కు వెళ్లి పురుగుల మందు తాగాడు. అత‌డినీ సుల్తానాబాద్ హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ రెనోవా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ గురువారం మ‌ర‌ణించిన‌ట్టు ఎస్సై వెల్ల‌డించారు. తండ్రి ముడ‌త‌న‌ప‌ల్లి సుధాక‌ర్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై తెలిపారు.

Next Story