- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ,సత్తుపల్లి : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రేగళ్లపాడు గ్రామానికి చెందిన షేక్. షాషా (25) ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేయడంతో పాటు స్థానికంగా కిరాణాషాపు నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ గిరిజన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె బంధువులు పంచాయితీ ఏర్పాటు చేసి కొట్టారు.
కిరాణా షాపు తీయొద్దని హుకుం జారీ చేశారు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. షాషా మృతికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న తల్లి, ఇటీవల ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై మంచంలో చికిత్స పొందుతున్న తండ్రి పాషాకు ఉన్నారు. పాషా మృతి చెందడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది.
- Tags
- suicide






