ఉరేసుకొని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

ఉరేసుకొని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ, బెజ్జంకి : ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సోరుపాక మల్లయ్య కుమారుడు సోరుపాక అమర్ (22) డిగ్రీ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటున్నాడు. శనివారం సాయంత్రం అమర్ ఎవరి లేని సమయంలో ఇంటి లో ఊరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి వచ్చి చూసే సరికి అమర్ ఊరి వేసుకోవడాన్ని గుర్తించి హుటాహుటిన కిందికి దించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మద్యలో సోరుపాక అమర్ మృతి చెందినట్లు తెలుస్తుంది. యువకుడి మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోరుపాక అమర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ సౌజన్య దర్యాప్తు చేప‌డుతున్నారు.


Next Story