- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ప్యాకెట్ ఇప్పించండి సార్ ప్లీజ్.. ఏపీలో మత్తు కోసం టవర్ ఎక్కి యువకుడు హల్ చల్
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఉడుతల హనుమంతు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య చాలా మంది మత్తుకు అలవాటుపడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మద్యానికి మాత్రమే బానిసైన యువత ఇప్పుడు గం*యికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోను దీని వాడకం పెరిగిపోతోంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా చాపకింద నీరులా గం*యి గ్రామాలు, పల్లెలకు విస్తరిస్తోంది. తాజాగా ఏపీలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో మద్యం మత్తులో ఉడుతల హనుమంతు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. గ్రామంలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన యువకుడు తనకు గం*యి ప్యాకెట్ కావాలని డిమాండ్ చేశాడు.
లేదంటే కిందకు దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మత్తులో తూలుతూ ఉన్న యువకుడు ఎక్కడ కిందపడతాడో అని అంతా ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఎస్సై దేవకుమార్ చాకచక్యంగా ఆ యువకుడిని మాటల్లో పెట్టి కిందకు దించాడు. ఎందుకు టవర్ పైకి ఎక్కావని ప్రశ్నించగా నాకు ఒక ప్యాకెట్ ఇప్పటించండి సార్ ప్లీజ్ అంటూ పోలసులనే బతిమాలాడు. దీంతో ఆ యువకుడిని తీసుకువెళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనతో గ్రామంలో గం*యి విక్రయిస్తున్నట్టు స్పష్టమైందని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు అది ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలుసుకుని పూర్తిగా నిర్మూలించాలని కోరుతున్నారు.






