పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం.. గుండు గీయించి.. ఇద్దరు యువకులను కట్టేసి కొట్టిన గ్రామస్తులు

by Sujitha Rachapalli |

ఒడిశా భద్రాఖ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న యువకుడు తన ఫ్రెండ్‌తో కలిసి ఆమెను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు

పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం.. గుండు గీయించి.. ఇద్దరు యువకులను కట్టేసి కొట్టిన గ్రామస్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా భద్రాఖ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న యువకుడు తన ఫ్రెండ్‌తో కలిసి ఆమెను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్తులు... ఇద్దరు యువకులను పోల్‌కు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గుండు గీయించి చిత్రహింసలకు గురిచేశారు. ముస్తాఫాపూర్ పంచాయతీ పరిధిలోని ధీప్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తమను విడిచిపెట్టాలని అభ్యర్థిస్తున్న కనీసం కనికరం కూడా చూపకుండా వ్యవహరించారు. కాగా దీనిపై స్పందిస్తున్న జనాలు.. దేశంలో లా అండ్ ఆర్డర్ ఉందని.. దాని ప్రకారం వెళ్లాలని.. అంత ఘోరంగా శిక్షించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.

Next Story