- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళపై ఇద్దరి యువకుల సామూహిక అత్యాచారం..?
లిఫ్ట్ అడిగిన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దారుణ ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

దిశ, జడ్చర్ల : లిఫ్ట్ అడిగిన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దారుణ ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ మహిళ రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ను లిఫ్ట్ అడిగింది. అప్పటికే ఆ బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని ముందుకు వెళ్లారు. మున్సిపాలిటీని దాటగానే బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి మళ్లీంచారు. రోడ్డుకు దూరంగా తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిళ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి పట్టణ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మహిళపై సామూహిక అత్యాచారం వెలుగు చూడటంతో జడ్చర్ల ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రశాంతంగా ఉన్న పట్టణంగా ఇలా ఎవరు చేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






