- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేగంబజార్ లో మహిళ దారుణ హత్య
by Malleboina Mahesh |
బేగంబజార్ ఫీల్ ఖానా ప్రాంతంలో మహిళ దారుణ హత్యకు గురైంది. డబ్బు కోసమే ఆమెను చంపి ఉండవచ్చని భావిస్తున్నారు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బేగంబజార్ ఫీల్ ఖానా ప్రాంతంలో మహిళ దారుణ హత్యకు గురైంది. డబ్బు కోసమే ఆమెను చంపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా ఫీల్ ఖానా ప్రాంతంలో భిక్షాటన చేస్తూ.. అక్కడే ఫుట్ పాత్ పై కాలం గడుపుతోంది. కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెను దుండగులు గొంతు నులిమి హత్య చేసారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గంజాయి బ్యాచ్ లేదా మద్యానికి అలవాటు పడ్డవారు ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం ఈ హత్య చేసి ఉంటారని, సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story






