మహిళా టూరిస్ట్‌‌ను లైంగికంగా వేధించి కత్తితో దాడి..

by Disha Web Desk 9 |
మహిళా టూరిస్ట్‌‌ను లైంగికంగా వేధించి కత్తితో దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: గోవాలో యోగా రిట్రీట్ కోసం వచ్చిన 29 ఏళ్ల డచ్ మహిళను రిసార్ట్ సిబ్బంది లైంగికంగా వేధించి కత్తితో పొడిచిన ఘటన ఉత్తర గోవాలోని పెర్నెమ్ పట్టణంలో చోటుచేసుకుంది. హోటల్ ఆవరణలోని తను అద్దె ఉంటున్న గుడారంలోకి 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడని డచ్ పర్యాటకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కేకలు వేయడంతో ఆ వ్యక్తి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. అరుపులు విన్న స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆమెను కాపాడేందుకు రావడంతో దుండగుడు పారిపోయాడని, ఆ తర్వాత మళ్లీ కత్తితో తిరిగి వచ్చి ఆమెతో పాటు స్థానికుడిపై కూడా దాడి చేసి పరారయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతిక్రమణ, గౌరవానికి భంగం కలిగించడం, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం వంటి నేరాల‌కు సంబంధించిన‌ పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం దృష్టి సారించి, డచ్ అధికారులు గోవా చేరుకున్నారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవాలోని ఓ హోటల్‌లో బార్ టెండర్‌గా పనిచేస్తున్న నిందితుడిని డెహ్రాడూన్‌కు చెందిన అభిషేక్ వర్మ (27)గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. మాండ్రేమ్లోని విగ్వామ్ రిసార్ట్ లో మంగళవారం, బుధవారం మధ్య అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (నార్త్ గోవా) నితిన్ వల్సన్ మీడియాకు తెలిపారు.

Next Story

Most Viewed