- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అమానుష ఘటన.. మహిళను వివస్త్రను చేసి ఊరేగింపు
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని విఠల్ నగర్ లో ఆలయ ప్రవేశం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ మహిళను బహిరంగంగా కొట్టి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పుల దండ వేసి అర్ధనగ్నంగా ఊరేగించారు.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని విఠల్ నగర్ లో ఆలయ ప్రవేశం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ మహిళను బహిరంగంగా కొట్టి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పుల దండ వేసి అర్ధనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ ఘర్షణ జరిగినట్టు ఉల్హాస్ నగర్ ఏసీపీ శైలేష్ కాలే తెలిపారు. బాధితురాలు, నిందితులు వాఘ్రి వర్గానికి చెందినవారని అన్నారు.
వారు బెలూన్స్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని వారంతే బంధువులేనని చెప్పారు. బాధితురాలు తమ దేవతలను అవమానించడం వల్లే ఆమెను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నామని నిందితులు చెబుతున్నారన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాల కోసం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మహిళపై దాడి చేసినవారిలో ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మరో నలుగురి కోసం గాలిస్తున్నామని అన్నారు.






