పండుగపూట తీవ్ర విషాదం.. రాఖీ కట్టిన కాసేపటికే అక్క మృతి.. ఏం జరిగిందంటే?

by Gantepaka Srikanth |

సోదర, సోదరీ మణులు మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ(Rakhi Festival)ను జరుపుకుంటారు.

పండుగపూట తీవ్ర విషాదం.. రాఖీ కట్టిన కాసేపటికే అక్క మృతి.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సోదర, సోదరీ మణులు మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ(Rakhi Festival)ను జరుపుకుంటారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని నమ్ముతారు. ఈ పండుగ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఇళ్లు సందడిగా మారుతుంటుంది. కానీ రాష్ట్రంలోని ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టి పుట్టింటి నుంచి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదం(Road Accident)లో అక్క చనిపోయింది. ములుగు జిల్లా నాంపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా అదుపు తప్పి కిండపడటంతో పద్మ అక్కడికక్కడే మరణించింది. భర్తకు స్వల్పగాయాలయ్యాయి. కాగా పద్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story