- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలో దూకి మహిళా ఆత్మహత్య
బావిలో దూకి ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోరుట్ల మండల పరిధిలోని మోహన్ రావు పేట గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, కోరుట్ల రూరల్ : బావిలో దూకి ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోరుట్ల మండల పరిధిలోని మోహన్ రావు పేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆది గంగమల్లు (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొలం దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళింది. సాయంత్రం అయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్ద, ఇతర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం రాత్రే కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, సోమవారం ఉదయం వారి పొలం వద్ద ఉన్న నీటి బావిలో గంగ మల్లు మృతదేహం తేలి కనిపించింది. గంగ మల్లు గత నాలుగేళ్లుగా వెన్నెముక డిస్క్ నొప్పితో తీవ్రంగా బాధపడుతుందని, ఈ విపరీతమైన నొప్పిని భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






