- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరం నడిబొడ్డున ఘోరం.. గర్భం దాల్చిన మైనర్ ఆత్మహత్యాయత్నం
మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురానగర్ (Madhura Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక గర్భం దాల్చిన తెలిసిన తర్వాత సదరు యువకుడు ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు యువకుడిపై పోక్సో, అత్యాచారం నిరోధక చట్టం కింద జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదు చేశారు.
కాగా, రాష్ట్రంలో మైనర్ బాలికలపై జరుగుతోన్న లైంగిక నేరాలు, బలవంతపు అబార్షన్లు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






