- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident:ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు స్పాట్ డెడ్
ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ, తిరుపతి రూరల్: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన పూతలపట్టు నాయుడుపేట హైవే రామానుజపల్లి చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ సీఐ కథనం మేరకు పూతలపట్టు నాయుడుపేట హైవే, రామానుజ పల్లి చెక్ పోస్ట్ వద్ద ఒక ప్రైవేట్ హోమ్ స్టే సమీపంలో ఉప్పరపల్లె -ఆర్ సి పురం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువతి, యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన యువకుడిని కడప జిల్లా పులి కుంట, బోరెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫకీర్ భాషా(21)గా గుర్తించారు. మృతి చెందిన యువతి ఎవరని తెలియరాలేదు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు విచారిస్తున్నట్లు తెలియజేశారు.






