Tragedy: పండుగ పూట తీవ్ర విషాదం.. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-30 04:20:59  IST  )

ఉగాది పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Tragedy: పండుగ పూట తీవ్ర విషాదం.. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/ఎల్లారెడ్డి: ఉగాది పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ రవీందర్, ఎస్సై మహేశ్ కథనం మేరకు మండల పరిధిలోని భిక్కనూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్‌కు చెందిన మౌనిక (26) ముగ్గురు పిల్లలు మైథిలి (10), అక్షర (9), వినయ్​(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక బట్టలు ఉతుకుతుండగా పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు.

కాగా.. చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోతుండగా పినతల్లి మౌనిక వారిని కాపాడేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ దుస్తులు కనిపించినా ఎవరి ఆచూకీ కనిపించ లేదు. దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తరువాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది. దీంతో మిగతా వారి కోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఈ మేురకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story