- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video: రివర్స్ తీస్తూ అదుపుతప్పిన టెంపో.. మహిళపైకి దూసుకెళ్లిన వైనం
రివర్స్ తీస్తూ టెంపో అదుపుతప్పి.. మహిళపైకి దూసుకెళ్లిన సంఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ ప్రమాదాలు ఆగడం లేదు. అదే తాజాగా రివర్స్ తీస్తుండగా ఒక టెంపో అదుపు తప్పింది. ఈ క్రమంలో మహిళపైకి దూసుకు వెళ్ళింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో ఉన్న ఓ టెంపో రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే ఆ సమయంలో వెనకాల నిలబడ్డ మహిళపైకి వాహనం దూసుకు వెళ్ళింది. ఈ వేగానికి కరెంటు పోల్ తో పాటు ఓ ఇంటి గోడ కూడా కుప్పకూలింది.
ఈ విచారకర సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నివాస ప్రాంతాల్లో భారీ వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని నెటిజెన్స్ పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. క్లిక్






