- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్తో నవోదయ విద్యార్థి మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
by Javid Pasha |
విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగింది. పాఠశాల సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న దుర్గా నాగేందర్ అనే విద్యార్థి పాఠశాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్ ధ్రువీకరించారు. ఇక ఈ ఘటనలో మరో ముగ్గురు విద్యార్థులు గాయపడగా వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






