లంచం కేసులో కీలక పరిణామం.. GHMC ఎస్‌ఈ చిన్నారెడ్డికి 14 రోజుల రిమాండ్

by Kema Shiva Kumar |

ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ (SE) చిన్నారెడ్డి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే.

లంచం కేసులో కీలక పరిణామం.. GHMC ఎస్‌ఈ చిన్నారెడ్డికి 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ (SE) చిన్నారెడ్డి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని ఆయన ఒక కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా, చిన్నారెడ్డిని పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Next Story