- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీనటి కల్పికకు దిమ్మతిరిగే షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
సినీనటి కల్పిక (Actress Kalpika)కు దిమ్మతిరిగి షాక్ తగిలింది. తాజాగా, ఆమెపై గచ్చిబౌలి (Gachibowli) పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సినీనటి కల్పిక (Actress Kalpika)కు దిమ్మతిరిగి షాక్ తగిలింది. తాజాగా, ఆమెపై గచ్చిబౌలి (Gachibowli) పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, మే 29న ప్రిజం పబ్ (Prism Pub)లో తిన్న ఫుడ్‌కు బిల్ కట్టుకుండా తిరిగి సిబ్బందిపై దాడి చేయడంతో పాటు అక్కడున్న విలువైన సామగ్రిని కల్పిక ధ్వంసం చేసింది. అదేవిధంగా పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతూ.. ఏకంగా పోలీసుల ఎదుటే హంగామా చేసింది. ఈ ఘటనపై ప్రిజం పబ్ యాజమాన్యం, నటి కల్పికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వక ఫిర్యాదును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అందజేశారు. దీంతో కల్పికపై 324(4),352,351(2) బీఎన్ఎస్ యాక్ట్ (BNS Act) ప్రకారం పోలీసులు నటి కల్పికపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపచనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






