- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL VIDEO:రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..మహిళను వెంబడించి, కిందపడేసి!
కర్నాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కర్నాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్‌లో ఓ మహిళను వెంబడించి, కింద పడేసి చైన్ స్నాచర్లు ఆమె బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: కర్నాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కర్నాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్‌లో ఓ మహిళను వెంబడించి, కింద పడేసి చైన్ స్నాచర్లు ఆమె బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. మహిళ స్కూటీపై వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆమెను వెంబడించారు. చుట్టు పక్కల ఇండ్లు ఉన్నప్పటికీ దుండగులు బయపడకుండా ఆమె వెంట పడ్డారు. తనను వెంబడిస్తున్నట్టు మహిళకు అనుమానం రావడంతో ఒక చోట బైక్ నిలిపివేసింది. దీంతో దుండగుడు ఆమె దగ్గరకు వచ్చాడు.
వెంటనే ఆమె పరిగెత్తడంతో అతడు కూడా వెండించి కిందపడిన తరవాత గొలుసును లాక్కుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు యువకుల్లా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువతే చెడు అలవాట్లకు బానిసై, ఫ్రీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.






