- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏకంగా 10 మంది దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఏకంగా 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా 10 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. దౌసా-మనోహర్‌పూర్ జాతీయ రహదారిపై బాపీ ప్రాంతంలో ప్యాసింజర్ వ్యాన్‌ను ఓ భారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యాన్‌లో ఉన్న 10 మంది తీవ్ర గాయాలతో మృతి చెందారు. అయితే, ఖాటు శ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సాగర్ రానా, కలెక్టర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని, 8 మంది తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి, మరో ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.






