ఎన్‌సీసీ ఫిజికల్ ట్రైనింగ్‌లో సైకో ప్రవర్తన..జూనియర్లను దారుణంగా కొట్టిన సీనియర్ (వీడియో)

by Dishafeatures2 |
ఎన్‌సీసీ ఫిజికల్ ట్రైనింగ్‌లో సైకో ప్రవర్తన..జూనియర్లను దారుణంగా కొట్టిన సీనియర్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్‌సీసీ ఫిజికల్ ట్రైనింగ్ లో భాగంగా జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థి దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్‌సీసీలో ఫిజికల్ వర్కవుట్స్ చేపిస్తున్న సమయంలో జూనియర్ విద్యార్థులను విచక్షన రహితంగా సీనియర్ విద్యార్థి చితకబాదాడు. వారితో కఠోరమైన ఫిజికల్ ఎక్సర్‌సైజ్ లు చేయిస్తూన్న సమయంలో.. తప్పుగా ఎక్సర్‌సైజ్‌లు చేసినందుకు ఒక కర్రతో వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డాడు. వారిని కొడుతున్న సమయంలో ఎవరో పై నుంచి వీడియో తీశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. మహారాష్ట్ర, థానేలోని జోషి బేడేకర్ కాలేజీలో ఎన్సీసీ ఫిజికల్ ట్రైనింగ్‌లో జూనియర్లను సీనియర్ విద్యార్థి దారుణంగా చితకబాదినట్లు తెలిసింది. కాగా ఈ వీడియో జోషి బేడేకర్ కాలేజీకి చెందినదని నిర్ధారిస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ సుచిత్రా నాయక్ వెల్లడించారు. జూనియర్లను కొడుతున్న సీనియర్‌ విద్యార్థి సైన్స్ స్ట్రీమ్ కి సంబంధించిన వాడని, అతనిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.



Next Story

Most Viewed