- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు.. చూస్తుండగానే దగ్ధం..
నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది.

దిశ, శంషాబాద్: నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. శంషాబాద్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం అల్లీకోల్ తండాకు చెందిన రవి నాయక్ బుధవారం మధ్యాహ్నం తన రేనాల్డ్ డస్టర్ కారులో నానక్ రామ్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కి బొంగులూరు గేటు ( ఎగ్జిట్ 12) వద్ద దిగడానికి కారులో వెళుతుండగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ గూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే క్కసారిగా కారు ఇంజన్ నుంచి పొగలు రావడం రవి నాయక్ గమనించాడు.
దీంతో కారును పక్కకు ఆపి చూసే లోపే మంటలు పూర్తిగా కారుకు అంటుకొని చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు పోలీీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






