- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండపల్లిలో గర్భిణీ, గిరిజన మహిళా దారుణ హత్య
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండల పరిధిలో గర్భిణీ, గిరిజన మహిళా దారుణ హత్య కలకలం రేపుతోంది.

దిశ, బెజ్జూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండల పరిధిలో గర్భిణీ, గిరిజన మహిళా దారుణ హత్య కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సమ్మక్క(25) గిరిజన మహిళను జైహిందూపూర్ కి చెందిన కెల్కరి జలపతి అటవీ ప్రాంతంలో హత్య చేసినట్టు తెలుస్తోంది. సమ్మక్క ఏడో నెల గర్భిణీ గా ఉండగా.. జలపతిని వివాహం చేసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య నాలుగేళ్లుగా సాన్నిహిత్య సంబంధం ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే పెళ్లి అయిన జలపతిని తనను పెళ్లి చేసుకోవాలని సమ్మక్క కోరడంతో.. శనివారం ఆమెను జైహిందూర్ ప్రాంతానికి పిలిచి కొండపల్లి-సులుగుపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తరువాత జలపతి తన సోదరుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో అతని సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటవీ ప్రాంతంలో సమ్మక్క మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిర్పూర్ (టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు జలపతి పై భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం హత్య కేసు తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాగజ్‌నగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న ట్లు సీఐ తెలిపారు.






