- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట సంఘటన జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, జహీరాబాద్ : ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట సంఘటన జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగల్గి బక్కారెడ్డి(40) మూడు రోజుల కిందట హైదరాబాద్ నుంచి రంజోల్ గ్రామానికి తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో బంధువులు వెతుకుతుండగా.. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక ఉన్న ఓ మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. అతని అన్న జగన్నాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. ఆస్తులు లేకపోవడం, పెళ్లి కాకపోవడంతో జీవితం పై విరక్తి చెందిన ఆయన ఉరేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






