- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలకృత్యాల కోసం వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతి
by Ratna Kumari |
కాలకృత్యాలకు చెరువు వైపు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ , గీసుకొండ : కాలకృత్యాలకు చెరువు వైపు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలిచర్ల గ్రామానికి చెందిన అల్లం మహేశ్వర్ (42) ఆదివారం చెరువు వద్దకు కాలకృత్యాల కోసం వెళ్లాడు. కాలు జారి నీటిలో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటికీ తీశారు. మృతుని భార్య అల్లం రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించినట్టు సీఐ తెలిపారు.
Next Story






