- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో మునిగి వ్యక్తి మృతి
కుబీర్ మండలంలోని సాంవ్లీ చెరువులో వెల్వత్ గ్రామానికి చెందిన అవధూత్ రాజరత్న (22) చెరువులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ పి.రవీందర్ తెలిపారు.

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని సాంవ్లీ చెరువులో వెల్వత్ గ్రామానికి చెందిన అవధూత్ రాజరత్న (22) చెరువులో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ పి.రవీందర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తానూరు మండలంలోని వెల్వత్ గ్రామానికి చెందిన వాడు. సాంవ్లీ గ్రామంలో ఉండే తన పెద్దమ్మ అయిన కొత్తిమీర సరోజబాయ్ ఇంటికి మృతుడు ఇటీవల వచ్చాడు.
గురువారం వరుసకు అన్నయ్య అయిన సందీప్ తో కలిసి సోలార్ ఫెన్సింగ్‌కు అవసరమయ్యే కట్టెల కోసం వెళ్లాడు. కట్టెలు జమ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో స్నానం చేసేందుకు చెరువులోకి దిగి నీళ్లలో పడిపోయాడు. సందీప్ పరిసరాల్లోని పొలంలో పనిచేస్తున్న వాళ్లను పిలిపించి చెరువులో వెతికించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం వెతకగా రాజారత్నం చనిపోయి ఉన్నాడు. మృతుడి తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రవీందర్ పేర్కొన్నారు.
- Tags
- died






