- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మరొకరి పరిస్థితి విషమం..!
దిశ, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలోని మెండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును

దిశ, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలోని మెండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆదిలాబాద్ వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో మండలంలోని హర్కపూర్ ఆంధ్ గూడా గ్రామానికి చెందిన బి.సంతోష్(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డీ.సంజీవ్(21)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరగడానికి రోడ్డు పై ఏర్పడిన గుంతలే కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. యాక్సిడెంట్ లో మృతి చెందిన బీ.సంతోష్ కుటుంబానికి 20లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని హర్కపూర్ ఆంధ్ గూడా గ్రామస్తులు డిమాండ్ చేశారు. గాయపడిన సంజీవ్ కు ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ప్రతి ఏడాది ముత్నూర్ గ్రామ సమీపంలోని మెండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఆర్.అండ్.బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.






