- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి కిందపడ్డ బైక్.. వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం కొహెడ మండలం కురెళ్ళ గ్రామ శివారులో జరిగింది.

X
దిశ, కొహెడ : రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం కొహెడ మండలం కురెళ్ళ గ్రామ శివారులో జరిగింది. పూర్తివివరాల్లోకెళితే సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కురెళ్ళ గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెజ్జెంకి మండలం గుగ్గిల గ్రామానికి చెందిన బోలుగం నరేష్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు కోహెడ గ్రామంలో పని వుండగా వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కూరేళ్ల గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. రక్తశ్రావం అధికంగా కావడంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య బోలుగం స్వాతి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






