- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Ratna Kumari |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన మండల పరిధిలోని మచ్చాపురం టోల్ ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది.

X
దిశ, మంగపేట : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన మండల పరిధిలోని మచ్చాపురం టోల్ ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపురం కి చెందిన నానావరపు రాణి, ఆమె కుమారుడు సందీప్ (33) వ్యక్తి గత పని కోసం ద్విచక్ర వాహనం పై హనుమకొండకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మచ్చాపురం టోల్ ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనానికి ఢీ కొట్టారు. సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి రాణి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను ములుగు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. సందీప్ మృతితో కమలాపురం గ్రామలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






